రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు.
ఇందులో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.
శాఖల వారీగా కేటాయింపులు..పోలవరం ప్రాజెక్టుకు- రూ.6,705 కోట్లు, అన్నదాత సుఖీభవ- రూ.6,300 కోట్లు, పాఠశాల విద్యకు-రూ.31,806 కోట్లు,ఉన్నత విద్యకు- రూ.2,506 కోట్లు, బీసీ సంక్షేమం-రూ.23,260 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి-రూ.20,281, ఎస్టీల సంక్షేమానికి- రూ.8,159 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం- రూ.5,434 కోట్లు, వైద్యారోగ్య శాఖ-రూ.19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ-రూ.18,848 కోట్లు, జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు, పురపాలక శాఖ-రూ.13,862 కోట్లు, ఇంధన శాఖ-13,600 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు- రూ.13,487 కోట్లు, రవాణాశాఖ-రూ.8,785 కోట్లు, సాంఘిక సంక్షేమం- రూ.10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం-రూ.10,619 కోట్లు.